హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న లలిత కళా తోరణంలో నానబియ్యం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ సమృద్ధమైన పుష్ప, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించింది. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తి, ప్రకృతి ప్రేమ, సామాజిక ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించి, ప్రోత్సహించడంతోపాటు వాటిని రాష్ట్ర పర్యాటక అనుభవంలో అంతర్భాగంగా ప్రదర్శించేందుకు పర్యాటక శాఖ 2026 ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





