హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ఆదివాసి కమ్యూనిటీల నుండి ఉన్నత శిఖరాలకు ఎక్కడమే కాదు.. ఉన్నత శిఖరాలకు ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. సచివాలయంలో తనను సోమవారం కలిసిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించనున్న పర్వతారోహకులను ఆమె అభినందించారు. ఆదివాసి కమ్యూనిటీ నుండి కోలాం, తోటి తెగల నుండి మడవి కన్ని బాయ్ (31), కాథ్లే ఆనంద్ రావు(23) ఎవరెస్ట్‌ను అధిరోహించడాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బీమంగోండి గ్రామం నుంచి మడవి కన్నిబాయ్, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దూపార్పేట గ్రామానికి చెందిన కాథ్లే ఆనంద రావులకు మంత్రి సీతక్క వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయం అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





