– తొమ్మిది జిల్లాల అధ్యక్షులు, పదాధికారులకు రామచందర్‌రావు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో – భీడ్‌తంత్ర హఠావో’ ఉద్యమంపై సమావేశంలో చర్చించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పోకడలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జిలు అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్.మధుకర్ జీ, పార్టీ రాష్ట్ర సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా (సహ సంఘటన ప్రధాన కార్యదర్శి), పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





