నవంబర్ రెండో వారంలో వేంసూరుకు నీళ్లు

– సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
– భూ నిర్వాసితులకు చెక్కులు అందజేత

దమ్మపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులను అభినందించారు. నవంబర్ రెండో వారంలో ఈ కాలువ ద్వారా గోదావరి జలాలను బేతుపల్లి చెరువు ద్వారా ఎన్టీఆర్ కెనాల్ నుండి వేంసూరు మండలానికి నీరు అందిస్తామని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేసి అశ్వరావుపేట నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, దమ్మపేట తహసిల్దార్ మద్దినేని మురళి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, అధికార పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *