– 6న టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి
– సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు హరీశ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ఎస్సెస్సీ జేఈ, టీజీఎస్పీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాదిమంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని బీఆరఎసఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్సెస్సీ జేఈ పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగొచ్చి ఇక్కడ ఏఈఈ పరీక్ష రాయడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఏళ్లతరబడి కష్టపడి సిద్ధమైన రెండు పోటీ పరీక్షల్లో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితిలో నిరుద్యోగ యువత పరీక్షల తేదీలు మార్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందించలేదని, పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని ఈనెల 14నే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీజీఎస్పీఎస్సీకి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మాత్రమే నిరుద్యోగ యువత కోరుతున్నదన్నారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు రేవంత్ రెడ్డి గారూ అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. భేñషజాలకు పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దన్నారు. తక్షణమే జోక్యం చేసుకొని నవంబర్ 6న జరగనున్న ఏఈఈ(సివిల్) పరీక్షను వాయిదా వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి గందరగోళం పునరావృతం కాకుండా ప్రభుత్వం, టీజీఎస్పీఎస్సీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హరీష్‌రావు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





