లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శన వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సినిమాలను మూడు రోజులపాటు వాయిదా వేశారు. 14, 15వ తేదీలలో చలనచిత్ర ప్రదర్శన కొనసాగింది. అయితే రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కళా ప్రదర్శన అదే సమయానికి ఉన్నందున లలిత కళాతోరణంలో 16 నుండి 18వ తేదీ వరకు ప్రతిపాదించిన సినిమాల ప్రదర్శనను వాయిదా వేసినట్లు భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు ఒక ప్రకటనలో తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *