– 760 మందికి పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం
– 16 మంది ప్రతిభావంతులకు స్వర్ణ పతకాలు
– ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి
హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 23 : వరంగల్ కిట్స్ 43వ వార్షిక గ్రాడ్యుయేషన్ డే (9వ అటానమస్ క్లాస్ ఆఫ్ 2026 బ్యాచ్) మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ వేడుకలో 760 మందికి పైగా పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు అందించనున్నట్లు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవానికి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రిన్సిపాల్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ గౌరవ అతిథిగా పాల్గొంటారు. కిట్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అధ్యక్షత వహించనున్న ఈ వేడుకకు కోశాధికారి పి.నారాయణరెడ్డి, కిట్స్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, యాజమాన్య సభ్యులు విచ్చేయనున్నట్లు ఆయన తెలిపారు.
2022–2026 విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), 2024–2026 పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులందరూ తప్పకుండా హాజరై స్వయంగా తమ డిగ్రీలను స్వీకరించాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్‌రెడ్డి, అకడమిక్ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ సూర నరసింహ రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) ప్రొఫెసర్ సి వెంకటేష్, అదనపు సీఓఈలు డాక్టర్ బి.కిరణ్, డాక్టర్ జి. రాజేందర్, డాక్టర్ ఎ.హరికుమార్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, పీఆర్వో డాక్టర్ డి ప్రభాకరాచారి, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





