డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ బి.రామకృష్ణ, అటుకుల శ్రీనివాసరెడ్డి ఎన్నిక‌య్యారు. సోమ‌వారం హైదరాబాద్‌లోని నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ (DTF Telangana State Committee Election | ) పూర్తయింది. డీటీఎఫ్‌కు తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం లభించిన నేపథ్యంలో, పదవీ విరమణ చేసిన బాధ్యుల స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బాధ్యుల వివరాలు
రాష్ట్ర అధ్యక్షుడిగా డా.బి. రామకృష్ణ (హైదరాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటుకుల శ్రీనివాసరెడ్డి (హనుమకొండ), ఉపాధ్యక్షులుగా : తూముల తిరుపతి (కరీంనగర్), ఎం.జయకృష్ణ(అదిలాబాద్),
కార్యదర్శులుగా ఎ. గోవిందరావు (వరంగల్), బి.వెంకటేశం (నల్గొండ), అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులుగా డా.జి.కళావతి(జనగాం) ఎన్నిక‌య్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.కిష్టప్ప, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె. నారాయణరెడ్డిలు వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *