సిజెఐ చంద్రచూడ్‌ ‌నివాసంలో వినాయక పూజs

ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌12:‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొ న్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు.

ప్రశాంత్‌ ‌తన ట్విట్ట ర్‌లో ట్వీట్‌ ‌చేశారు. ప్రైవేట్‌ ‌ట్‌ ‌కోసం సిజెఐ చంద్రచూడ్‌ ‌తన నివాసానికి మోదీని అనుమతి ంచడం మంచిది కాదు అని, ఇలాంటి సమయంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తా యని భూషణ్‌ ‌పేర్కొన్నారు. సిజెఐ ఇంట్లో జరిగిన గణ పతి పూజలో ప్రధాని మోదీ పాల్గొన్న వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారింది.

సిజెఐ ఇంటికి ప్రధా ని వెళ్లడం ఎంత వరకు సరైందని నెటిజన్లు నిలదీ స్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. సిజెఐ ఇంట్లో ప్రధాని పూజలో పాల్గొనడం తప్పుడు సంకే తాలు ఎలా అవుతాయని మరికొందరు కామెంట్లు చేస్తు న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *