ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల డంప్ లభ్యం

– భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం        

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెద్రే ప్రాంతంలోని లంకా పహాడి గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ బయటపడింది. భద్రతా బలగాలు మంగ‌ళ‌వారం తమ గాలింపు చర్యలలో మావోయిస్టులు భారీగా దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించాయి. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో 01 ఎస్ఎల్‌ఆర్/ఎల్‌ఎంజి రైఫిల్, 01 ఇన్సాస్ రైఫిల్, 01.315 బోర్ గన్, 02 బీజీఎల్ లాంచర్లు, 17 బీజీఎల్ సెల్స్, 1 చైనా హ్యాండ్ గ్రెనేడ్, 49 ఎస్ఎల్‌ఆర్ రౌండ్లు, 15 .315 బోర్ రౌండ్లు, 15 బీజీఎల్ కాట్రిడ్జ్‌లు, 4 ఎస్ఎల్‌ఆర్  మ్యాగజైన్లు, 01 .315 బోర్ మ్యాగజైన్‌తోపాటు ఇతర సామగి ఉన్నాయి. అలాగే భైరామ్‌గఢ్ ప్రాంతంలోని అద్వాడ అటవీ ప్రాంతం నుండి ఏకే-47, .315 బోర్ ఆయుధం, సింగిల్-షాట్ గన్, పిస్టల్‌తో పాటు సజీవ తూటాలు, మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఫర్సేగఢ్ ప్రాంతంలోని బదేల్‌వాడ అటవీ ప్రాంతం నుండి .315 బోర్ రైఫిల్, 49 సజీవ తూటాలు, 25 సజీవ .303 తూటాలు, 49 సజీవ 12 బోర్ తూటాలు, 8 కేజీల జిలాటిన్, వాకీ-టాకీ, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌డీవోపీ సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. మిర్తూర్ ప్రాంతంలోని ఇంద్రిపాల్ అటవీ ప్రాంతం నుండి ఏడు కట్టల విద్యుత్ రహిత తీగలు, డిటోనేటర్లు, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, భోపాల్‌పట్నం ప్రాంతంలోని నీలమ్‌డగు అటవీ ప్రాంతం నుండి 12 బోర్ నాటు తుపాకీ, బీజీఎల్ లాంఛర్, 8 బీజీఎల్ సెల్స్, 10 సజీవ 12 బోర్ తూటాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *