– రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంగాళాఖాతంలో ఏ ర్పడిన వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద రాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బు ధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తా రంగా కురుస్తాయని పేర్కొన్న ది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రా ష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ప్ర స్తుతం బంగా ళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధి కారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





