మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

– విప్రో సర్కిల్‌లో ఆయన విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తరతరాలకు దార్శనికుడు, దేశం గర్వించదగ్గ జాతిరత్నం డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని కొనియాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన సరళీకృత విధానాలు తెచ్చారని గుర్తు చేశారు. భారత్‌ను సంక్షోభం నుంచి దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని చెప్పారు. నాడుౖ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లుపై సంతకం చేశారని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మాజీ ఆర్ధిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొని మ‌న్మోహ‌న్ సింగ్‌కు నివాళుల‌ర్పించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *