“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందరో పత్రిక దిగ్గజ సంపాదకులకు ఈయన మార్గదర్శి నిర్దేశకుడు కూడా. భారత మాజీ ప్రధాని మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు బాల్య స్నేహితుడు.. సమకాలికుడు. వీరిరువురి ఆధ్వర్యంలో కాకతీయ పత్రిక వరంగల్ నుండి వెలువడినది జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. వీరి రచనలో పాఠకులను రంజింప చేసే విధంగా ఉండేవి..”
వరంగల్ మామునూరులో ఏర్పాటు చేయనున్న పౌర విమానాశ్రయానికి ఓరుగల్లు స్థిరనివాసి మట్టేవాడకు చెందిన పాములపర్తి సదాశివరావు పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది. నిరాడంబరుడు, నిగర్వి,అట్టహాసాలు భజనపరులేని సంఘసంస్కర్త, నడిచే ఎన్సైక్లోపీడియా అతి సామాన్య జీవితం గడిపిన మహా మేధావి వ్యక్తి పేరు విమానాశ్రయానికి పేరు పెట్టడం ఓరుగల్లుకే గాక యావత్ తెలంగాణకు ఒక మహోన్నత వన్నె కలుగుతుంది. మూలకు పడ్డ విమానాశ్రయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తున్న విధముగా మరుగున పడ్డ ఒక చరిత్రకారున్ని సంఘసంస్కర్తను బాహ్య ప్రపంచానికి తెలపడం సదాశయం అవుతుంది.
ఒక దెబ్బకు రెండు పిట్టలుగా ఉంటుంది.
భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కర్త పీవీ నరసింహారావు పేరును ఒక జిల్లా / ప్రాంతీయ స్థాయి విమానాశ్రయానికి పేరు పెట్టడం సముచితంగా ఉండదేమో అని నా అభిప్రాయం. ఆయన పేరును ఖండంతరాలు ఖ్యాతించే విధముగా న్యూదిల్లీ,ముంబాయి, కోల్ కత్తా చెన్నై మహనగరాలలోని సంస్థలకు పెట్టాలి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందరో పత్రిక దిగ్గజ సంపాదకులకు ఈయన మార్గదర్శి నిర్దేశకుడు కూడా. భారత మాజీ ప్రధాని మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు బాల్య స్నేహితుడు.. సమకాలికుడు. వీరిరువురి ఆధ్వర్యంలో కాకతీయ పత్రిక వరంగల్ నుండి వెలువడినది జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. వీరి రచనలో పాఠకులను రంజింప చేసే విధంగా ఉండేవి. సందేశమ్ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ఈయన 1945లో కాకతీయ కళాసమితిని స్థాపించినారు. ఈ సంస్థ కళలు సాహిత్యం నాటకాలు శాస్త్రీయ సంగీతం మొదలైన వాటిని ప్రోత్సహించినది.

ప్రతియేటా ఈ సంస్థ తరఫున మూడు రోజులు త్యాగరాజ మహోత్సవాలను నిర్వహించేవారు. కాకతీయ పత్రికతో పాటుగా విశ్వజ్యోతి ధర్మభూమి మొదలైన పత్రికలలో విస్తృతంగా రచనలు చేసినారు. మార్క్సిజం మొదలుకొని ప్రపంచ చరిత్ర భారతీయ తత్త్వము హిందుస్తానీ సంగీతం కర్ణాటక సంగీతం నాటకరంగం ఇట్లా అన్ని విషయాలపైనా వ్యాసాలు వ్రాసినారు. 1982లో వరంగల్లులో జరిగిన పోతన పంచశతాబ్ది ఉత్సవాలకు ప్రేరేపకుడు, పోతన విజ్ఞానపీఠం స్థాపనకు కారకుడు 1988లో కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్యారణ్య విద్వద్గోష్ఠిలో చురుకుగా పాల్గొని విద్యారణ్యుని తత్వంపై పత్రసమర్పణ చేసినారు. ఈయన జ్ఞాపకార్థం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతియేటా ఒక ప్రముఖవ్యక్తిచే స్మారకోపన్యాసం ఇప్పిస్తున్నది. ఆజాంజాహి కార్మికుల ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. 76 సంవత్సరాలు జీవించి కేన్సర్ వ్యాధితో 1996, ఆగస్టు 26వ తేదీ మరణించినారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని పక్షాల రాజకీయ నాయకులకు పట్టణానికి చెందిన అనేకమంది
ఆనాటి ఉన్నతాధికారులకు సంఘసంస్కర్తలకు సాహిత్య కళా రంగాలకు చెందిన వ్యక్తులకు పాములపర్తి సదాశివరావు సుపరిచితుడు. పీవీ కుటుంబ సభ్యులు, ఆదర్శప్రాయుడు అజాత శత్రువు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు అపర మేధావులు, పత్రికారంగ దిగ్గజాలు దేవులపల్లి అమర్, మాడభూషి శ్రీధర్, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్ష నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకుని పోయి వరంగల్ విమానాశ్రయానికి ఈయన పేరు తప్పనిసరిగా పెట్టుటకు ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
-దండంరాజు రాంచందర్ రావు
పాత బోయినపల్లి, సికింద్రాబాద్
9849592958