న్యూదిల్లీ, సెప్టెంబర్ 21: తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో సోమవారం మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈనెల 23న విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పదవిలో ఉంటూనే కాంగ్రెస్ బీ ఫాంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దానంపై అనర్హత వేటు వేస్తూ తీర్పు చెప్పిన విషయం విదితమే. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




