మహాదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్ పిన్ అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో కేంద్ర
దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, ప్రధాన కింగ్ పిన్ లలో ఒకడైన అభిషేక్ కుమార్ ను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తుండగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకున్న వెంటనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహాదేవ్ బుక్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో, ప్యానెళ్లను సమన్వయం చేయడం, నిధుల సేకరణలో అభిషేక్ కుమార్ చురుగ్గా వ్యవహరించాడని సీబీఐ విచారణలో తేలింది. బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతో దుబాయ్ లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సీబీఐకి ఆధారాలు లభించాయి. అభిషేక్ అరెస్ట్ సమయంలో అతడి వద్ద ఉన్న పలు కీలక ఆధారాలు, పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితులు సౌరభ్ చంద్రకర్, శుభం సోనీలతో కలిసి ఇతడు పనిచేశాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అరెస్ట్ అనంతరం నిందితుడిని హైదరాబాద్ స్థానిక కోర్టులో హాజరుపరిచి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. అనంతరం రాయ్ పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మహాదేవ్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 ఎఫ్ఐఆర్లను సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు వంద‌మంది నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్లను దాఖలు. చేసింది. ఇందులో ముఖ్యంగా యాప్ ప్రధాన. నిర్వాహకులు, ప్యానెల్ ఆపరేటర్లు, హవాలా వ్యాపారులు, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ప్రధాన ప్రమోటర్లను భారత్ కు తీసుకొ చ్చేందుకు ఇప్పటికే ఏడు రెడ్ కార్నర్ నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *