లారీ బీభత్సం : ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

– మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలు

ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 163పై ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ రెండు వాహనాలను ఢీకొట్టింది. ముందుగా 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన లారీ ఆగకుండా ముందుకు వెళ్లి రెవెన్యూ శాఖకు చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగురం రమాకాంత్(36) అనే జవాన, మరొక జవాను మృతిచెందగా, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం అనంతరం పరారైన లారీ డ్రైవర్ కోసం పస్రా పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *