– మంత్రి పొంగులేటి ధీమా
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ఘన విజయం సాధిస్తారన్న ధీమాను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యక్తం చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తంరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిని సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత, పట్టభద్రులు-ఉద్యోగ వర్గాలతో ఉన్న అనుబంధం సర్వోత్తంరెడ్డికి కలిసొస్తాయని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రుల ఆశయాలను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం కల్పించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రస్తుతం ఏఐసీసీ, టీపీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న సర్వోత్తంరెడ్డి పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





