ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

– సీఎంను కలిసిన ‘గోద్రెజ్’ ప్రతినిధులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్(కార్పొరేట్ వ్యవహారాలు) రాకేష్ స్వామి, గోద్రెజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై రాకేష్ స్వామి ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటువుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ప్రాసెసింగ్ మిల్ కోసం రాహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరగా టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

సీఎంను కలిసి మలేసియా ఎంపీ

మలేసియా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎం.శరవణన్ ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్-2026లో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమ్మిట్లో పాల్గొన్న మరికొందరు అంతర్జాతీయ ప్రతినిధులు కూడా సీఎంను కలిశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలనాపరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగంతోపాటు భవిష్యత్తు పెట్టుబడులపై ముఖ్యమంత్రి, శరవణన్, అంతర్జాతీయ ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది. సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *