– పాలమూరు జిల్లా గుండెల మీద తన్నిన మూర్ఖుడు కేసీఆర్
– ఉద్యోగులకు మొదటి తారీకునే జీతాలు
– కేసీఆర్ తప్పులకు ఏటా వడ్డీలకు రూ.80వేల కోట్లు కడుతున్నాం
– త్వరలోనే కృష్ణా జలాలు తెస్తాం
– కొడంగల్ భూముల్లో పచ్చని పంటలు పండేలా చేస్తా
– లగచర్ల సభలో సీఎం రేవంత్
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు.కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడని,ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్ కు పోయిండని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం లగచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు.. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు.. ఈ 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదన్నారు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కెసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం.తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం.. ఇన్నేండ్లు ఏ దేవుడు మన కష్టాలు వినలేదు.2023 లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో.. కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం దక్కిందన్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఏ ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదు.పదేళ్లలో కేసీఆర్ 8 లక్షల 11 వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు.నాకు అప్పు చేసే అలవాటు లేదు… అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు చూసి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని ఆలోచన చేశాం.2024 జనవరి 1 నుంచి ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు పడుతున్నాయ్. ప్రతీ సంవత్సరం కేసీఆర్ అప్పులకు తప్పులకు 80 వేల కోట్లు చెల్లిస్తున్నాం.కేసీఆర్ అప్పులకు తప్పులకు ఈ 34 నెలల్లో 2 లక్షల కోట్లకుపైగా చెల్లించాం.మాట్లాడాలి రమ్మంటే కెసీఆర్ రాడు..ఆయన తింటే బకాసురుడు.. పంటే కుంభకర్ణుడు.మక్తల్-నారాయణపేట-
కొడంగల్ పై వరాల జల్లు
కొడంగల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో మొత్తం రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రహదారులు, సాగునీరు, విద్య, వ్యవసాయం, రవాణా, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
రహదారులకు భారీగా నిధులు
కొత్తవాల్గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులకు శ్రీకారం చుట్టారు. మరో రూ.59.30 కోట్లతో వివిధ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు సాగునీటి సదుపాయాలు మెరుగుపరిచే లక్ష్యంతో రూ.2,100 కోట్లతో ఎంఎన్కఎల్ఎఎస్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. విద్యా రంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కొడంగల్లో రూ.123 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. రవాణా, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
కొడంగల్, కోస్గి, మద్దూరులో రూ.41.83 కోట్లతో ఆధునిక బస్ స్టాండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మద్దూరులో రూ.20 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. మరో రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం నిర్మించనున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణానికి, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్తాపన చేశారు.తిమ్మారెడ్డిపల్లిలో రూ.4.45 కోట్లతో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి, కొడంగల్లో రూ.5.10 కోట్లతో నిరంజన్ మఠం అభివృద్ధికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి పాదయాత్ర
అంతకుముందు పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి పాదయాత్రగా లగచర్ల బహిరంగ సభకు బయలుదేరారు. ఆయనతోపాటు పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




