– జనవరిలో రానున్న ఎన్నికల షెడ్యూల్
– క్షేత్రస్థాయి సమీక్షలో ఎన్నికల సంఘం
న్యూదిల్లీ, నవంబర్ 9 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల షెడ్యూల్ ను రానున్న జనవరిలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వ ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రకటనకు ముందే ఎన్నికలు జరగనున్న ఐదు రా ష్ట్రాల్లో ఈసీ పూర్తిస్థాయి బెంచ్ పర్యటిం చనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లతో కూడిన ఫుల్ బెంచ్ నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ లో తమ పర్యటనలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పర్యటనల సందర్భంగా రాష్ట్రాల క్షేత్రస్థాయి పరిస్థితులను, భద్రతను, ఎన్నికల సన్నద్ధతను ఈసీ సమగ్రంగా సమీక్షించనుంది. రాష్ట్రాల ప్రధాన కా ర్యదర్శులు, డీజీపీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికా రులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వ హించి వారి అభిప్రాయాలను స్వీకరిం చనుంది. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమి షనర్ స్థాయి బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రాథమిక సన్నాహక పనులను సమీ క్షించాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ బృందాల పర్య టనలు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపె ద్ద రాష్ట్ర మైన ఉత్తరప్రదేశ్లో ఒక దఫా పర్యటన ముగియగా, మరో రెండు విడత ల పర్యట నలు జరగాల్సి ఉంది. ఇక గోవాలో డీఈ సీ బృందం త్వరలోనే పర్య టించనుంది. నవంబర్ నెలాఖరు నాటికి ఈ బృందాలు తమ పూర్తిస్థాయి అధ్య యన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నాయి.
EC prepares for elections in five states; schedule may announce in January
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





