రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం

తుర్కపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ సైనికుడు మృతిచెందిన ఘటన మండలంలోని పీర్లపల్లి సమీపం లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకా రం.. కొండాపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పల్లపు మహేందర్ (మహేష్) ఎనిమిదేళ్లుగా జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో ఆర్మీ సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 20 రోజుల క్రితమే సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం జగదేవ్ పూర్ మండల కేంద్రానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పీర్లపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేందర్ను చికిత్స నిమిత్తం ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. అనం తరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎనిమిదేళ్లుగా దేశ రక్షణలో సేవలందించిన జవాన్ అకాల మరణంతో కొండాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *