‘టవర్స్’ స్థలాల్లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ మహానగర పరిధిలోని ఇందిరమ్మ ఇల్లు టవర్స్ ప్రాజెక్టులలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా దీపావళి నాడు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు టవర్స్ వద్ద హౌసింగ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు కింద నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో ఇల్లు కేటాయించిన లబ్దిదారులతో కలిసి దీపావళి పండుగను ఆనందంతో జరుపుకున్నట్లు బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బండ్లగూడ, కార్వాన్‌లోని కుల్సుంపురా, కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ, మలక్‌పేటలోని గడ్డిఅన్నారం, మల్కాజిగిరిలోని కౌకూర్, మేడ్చల్‌లోని పోచారం, నాంపల్లిలోని రెడ్‌హిల్స్, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, శేరిలింగంపల్లిలోని రాయదుర్గం ప్రాజెక్టు స్థలాల్లో చీఫ్ ఇంజినీర్, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు వేడుకలను నిర్వహించారని పేర్కొన్నారు. లాటరీ ద్వారా ఎంపికైన ఇండ్ల కేటాయింపుదారులు తమకు ఫ్లాట్లు నిర్మించనున్న ప్రాజెక్టు స్థలాలకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. అక్కడ దీపావళిని జరుపుకోవడం పట్ల హాజరైన కేటాయింపుదారులందరూ సంతోషం వ్యక్తం చేశారన్నారు. పెద్ద సంఖ్యలో లబ్దిదారులు పాల్గొని కాబోయే తమ ఇరుగుపొరుగు వారితో సంతోషంగా గడిపారని గౌతం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *