ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం., రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని అన్ని సాంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైనదని అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మపండుగ ప్రజల జీవితంలో భాగమైందని తెలిపారు. ఎంగిలిపూల బతుమ్మగా ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి îనెలకొంటుందని కేసీఆర్ తెలిపారు. పిల్లాపాపలతో ఒకచోట కూడి ఆటపాటలతో ఆడపడుచులు బతుకమ్మను కొలిచి మొక్కుతారని అన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదానివ్వడమే కాక ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సంప్రదాయాన్ని అమలు చేసిందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల కార్యక్రమాలను నాటి బీఆరఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *