– హనుమకొండ కలెక్టర్ కు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం స్పందించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ఆదేశించారు. కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి ఖరారు చేయాలని కలెక్టర్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


