– సీఎం రేవంత్రెడ్డికి మంత్రి పొన్నం విజ్ఞప్తి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 19: హుస్నాబాద్ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఆయన ఈ అంశాన్ని తీసుకెళ్లారు. హుస్నాబాద్ను సిద్ధిపేట జిల్లాలో బలవంతంగా కలిపారని విమర్శించారు. బలవంతపు పెళ్లి ఎక్కువ కాలం నిలువదని ఈ సందర్భంగా మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ సమస్యలు పరిష్కరిస్తు న్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




