– షెడ్యూల్ విడుదల
– జిల్లాలు, మండలాల వారీగా తేదీలు, కేంద్రాల వివరాలు ప్రకటించిన సీఐడీ
– రూ.447 కోట్ల కుంభకోణం.. 1.65 లక్షల మంది బాధితులకు వెరిఫికేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సంబంధించిన బాండ్ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియకు తెలంగాణ సీఐడీ శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ తేదీలు, కేంద్రాలు, వెరిఫికేషన్ నిర్వహించే అధికారుల వివరాలను ప్రకటించింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన సుమారు రూ.447 కోట్ల కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు సంబంధించిన డిపాజిట్ బాండ్ పత్రాలు, ఇతర ఆధారాల పరిశీలన కోసం ప్రత్యేకంగా వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ మేరకు జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ తేదీలు, నిర్వహించే ప్రదేశాలు, బాధ్యతలు నిర్వర్తించే అధికారుల వివరాలతో కూడిన సమగ్ర షెడ్యూల్‌ను సీఐడీ విడుదల చేసింది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే బాధితులు తప్పనిసరిగా తమ వద్ద ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ బాండ్ పత్రాలు, సంబంధిత రశీదులు, గుర్తింపు కార్డులు తదితర అవసరమైన ఆధారాలను తీసుకురావాలని సూచించింది. బాధితులు తమకు కేటాయించిన తేదీ, వెరిఫికేషన్ కేంద్రం వివరాలను పరిశీలించి, నిర్ణీత సమయంలో సంబంధిత అధికారుల ఎదుట హాజరుకావాలని సీఐడీ కోరింది. అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయడంతోపాటు వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా సంస్థలు విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

