రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా ?

– మాటల్లో కోతలు.. వేతనాల్లో కోతలు
– జీఓ.ఆర్.నెం.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలం దిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హరీష్‌ రావును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 12.07. 2026 నాటి జీఓ.ఆర్.టి.నెం.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సిందిపోయి కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమని మండిపడ్డారు. ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు ఉంటే కాంగ్రెస్ హయాంలో వేతనాల్లో కోతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఉద్యోగుల వేతనాలు తగ్గించడం ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన అవుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే జీఓ.ఆర్.టి.నెం.1181 1ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని, వేతన రక్షణ కల్పించడంతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *