100 రోజుల్లో హామీలు.. కానీ ఏ 100 రోజులో చెప్పామా?

– మాక్ అసెంబ్లీలో తలసాని వ్యాఖ్యలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో శ‌నివారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్ గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, హామీల అమలుపై తలసాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని, అయితే ఏ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పలేదంటూ తలసాని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు మేమే చే స్తామని అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో అని చెప్పామా? ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు మేమే ఉంటాం.. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం” అంటూ తలసాని వ్యంగ్యంగా మాట్లాడారు. సభలో సభ్యులు సబ్జెక్ట్ తప్ప ఏమైనా మాట్లాడుకోవాలని సూచించారు. ‘నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఢిల్లీతో సమస్య, పార్టీలో సమస్య.. ఆఖరికి బీఆర్ఎస్ లో కూడా ప్రశాంతత లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరాగాంధీ నిర్మించారని చెప్పడం ద్వారా తలసాని సభలో నవ్వులు పూయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *