– యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
– 20 సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అర్హుల జాబితా
– 23 వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : క్యూర్ పరిథిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. రోజూ నాలుగు నియోజకవర్గాల చొప్పున వరుసగా నాలుగు రోజులపాటు 30వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహ్ణిమని వివరించారు. క్యూర్ పరిథిలో లక్ష ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే పేరుతో హౌసింగ్ బోర్డు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసే సమయానికి మీ-సేవ కేంద్రాలతోపాటు, ఆన్‌లైన్‌లోనూ, వాట్సాప్ మీ-సేవ ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నదన్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్‌లో స్థిర నివాసముంటున్నారా లేదా, ఓఆరఆర్ లోపల వారికి ప్లాట్, ఫ్లాట్ వంటివి ఉన్నాయా వంటి మొదలైన వివరాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను గురువారం సాయంత్రం నుంచి ష్ట్రttజూs://ts.ఎవవsవఙa.tవశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ/, tస్త్రష్ట్రb.cస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ, tస్త్రష్ట్రb.tవశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. ఈ జాబితాలోని వివరాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 23వ తేదీ సాయంత్రం వరకు తెలియచేయవచ్చన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని ఆయన వివరించారు. రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో ఈ లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని, ఈ ప్రక్రియను యూట్యూబ్, తదితర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ముందు ప్రకటించినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ¾, దివ్యాంగులు, తదితర రిజర్వేషన్ల ప్రకారం డ్రా తీస్తామన్నారు. ప్రతి కేటగిరీలోనూ 20 శాతం వెయిటింగ్ లిస్టు కూడా రూపొందిస్తామని, వీరిని కూడా లాటరీ ద్వారానే ఎంపికి చేస్తామని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబరు 040 24603572 లో సంప్రదించవలసిందిగా ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




