బాలికల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు

– ఐదుగురికి జీవిత ఖైదు.. మరో 28 మందికి పలు శిక్షలు
– తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం
– సిఐడి మహిళా భద్రతా విభాగం దర్యాప్తుతో కేసులో కీలక తీర్పు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: బాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి అక్రమ రవాణా, లైంగి క దోపిడీకి పాల్పడిన దారుణ నేరంలో హైదరాబా ద్ లోని పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం శిక్షలు ఖరారు చేశారు. హకా భవన్ లోని ఎఫ్ఎస్సీ కోర్టు వెలువ రించిన ఈ తీర్పులో ఐదుగురికి జీవిత ఖైదు విధిం చగా, బాధితులైన తొమ్మిది మంది మైనర్ బాలికలకు పరిహారంగా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున మొ త్తం రూ. 45 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సీఐడీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో 2015లో నమో దైన జైం నంబర్ 14/2015కు సంబంధించిన కేసు లో విచారణ పూర్తయింది. మహిళల భద్రత విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన ఈ కేసులో పోక్సో చ ట్టం, ఐపీసీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.

ఉద్యోగం పేరుతో మోసం

2015 జులై 17న బాధితురాలు సీఐడీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. గ్రామంలో వ్యవసాయ పనులు చేసు కుంటున్న ఆమెకు పరిచయస్తుడైన వ్యక్తి ఉద్యోగం ఇప్పి స్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను ఏ1 నుంచి ఏ3 నిందితులకు పరిచయం చేసి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడంతోపాటు పలు వురితో లైంగికంగా సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి చేసినట్లు తెలిపింది. సుమారు నాలుగు నెలలపాటు నిందితుల నియంత్రణలో ఉన్న బాధితురాలు వారి నుంచి తప్పించుకుని సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీ సులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు.

9 మంది బాలికలకు విముక్తి

దాడుల సందర్భంగా ఏ1 నుంచి ఏ45 వరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది మైనర్ బాలికలతో పాటు పలువురు. బాధితులను రక్షించారు. నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనం తరం శాస్త్రీయ, సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు విచారణ అనంతరం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు విధించారు. ఐదుగురికి జీవిత ఖైదు. -ముగ్గురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 14 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పోక్సో చట్టం, ఐపీసీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్లోని వివిధ నిబంధనల కింద ఈ శిక్షలు విధించారు.

బాధితులకు రూ.45 లక్షల పరిహారం

నిందితుల దారుణ చర్యల కారణంగా శారీరక, మాన సిక వేదనకు గురైన తొమ్మిది మంది బాధిత బాలిక లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్ట ప్రకారం ఇప్పటికే అందిన పరిహా రానికి అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొం ది. పరిహారం చెల్లింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శిని ఆదేశించింది. నిందితులపై జరిమానా మొత్తాన్ని కూడా బాధితులకు పరిహారంగా అందించాలని సూచించింది.

దర్యాప్తు అధికారుల కృషి

ఈ కేసులో డీఎస్పీలు సురేశాబాబు, కె. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ కె. బాలరాం రెడ్డి దర్యాప్తు అధికారులు గా వ్యవహరించారు. కోర్టు డ్యూటీ అధికారిగా హెడ్ కానిస్టేబుల్ శాంతి శ్రీనివాస్గడ్డి (హెచ్సీ-2044). కేసు మానిటరింగ్ అధికారిగా సీఐడీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. ప్రభుత్వ న్యాయవాది, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరెల్ల రమాదేవి కేసును వాదించారు.
మహిళలు, బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ వంటి తీవ్రమైన నేరాల్లో శాస్త్రీయ దర్యాప్తు, సమర్థవం తమైన ప్రాసిక్యూషన్తో నిందితులకు శిక్షలు పడేలా చేసిన ఈ తీర్పు కీలకమని సీఐడీ మహిళా భద్రత విభాగం పేర్కొంది. బాధితులకు రక్షణ, పునరావాసం, పరిహారం అందించడంతో పాటు నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *