అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

– 4X400 మీటర్ల రిలేలో..

న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెటిక్స్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. మహిళల 4I400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, ఎం.ఆర్.పూవమ్మ, ప్రాచి, విథ్యా రామ్‌రాజ్‌తో కూడిన భారత బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 3:29.69 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. చివరి దశలో బహ్రెయిన్ నుంచి సల్వా ఈద్ నాసర్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే యాంకర్‌గా బరిలోకి దిగిన విథ్యా రామ్‌రాజ్ ఒత్తిడిని అధిగమించి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో భారత బృందం స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత్ 3:29.69 నిమిషాల్లో రేసు పూర్తి చేయగా బహ్రెయిన్ 3:30.21తో రజతం, చైనా 3:31.02తో కాంస్యం సాధించాయి. బహ్రెయిన్‌పై భారత్ 0.52 సెకన్ల ఆధిక్యంతో గెలిచింది. విథ్యా రామ్‌రాజ్‌కు నాగోయా ఏషియన్ గేమ్స్‌లో ఇది మరో పతకం. అంతకుముందు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఆ రేసులో 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో పరుగెత్తి పి.టి.ఉష పేరిట 42 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *