ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇన్ స్పెక్టర్ ల (సిఐ)  బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని మల్టీ జోన్-1 ఐజీ సంపత్ చంద్రశేఖర్ రెడ్డి జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం పలువురు సిఐలను బదిలీ చేయగా, ముఖ్యంగా ఖమ్మం నగరంలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న వారికి స్థానచలనం కలిగింది. వీరిలో నలుగురు సీఐలకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇన్ స్పెక్టర్ జ్ఞాన దృష్టి రామకృష్ణను ఖమ్మం సీఎస్బీ నుంచి ఖమ్మం టూ టౌన్ సీఐగా బదిలీ చేశారు. బొమ్మెర బాలక్రిష్ణను ఖమ్మం టౌ టౌన్ నుంచి బదిలీ చేస్తూ ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మహ్మద్ సాదిక్ పాషాను మెయిన్ ఇంటెలిజెన్స్ నుంచి ఖమ్మం వన్ టౌన్ సీఐగా బదిలీ చేశారు. తాటిపాముల కరుణాకర్ ను ఖమ్మం వన్ టౌన్ నుంచి ఖమ్మం వేకెన్సీ రిజర్వులో ఉంచి, రఘునాథపాలెం స్టేషన్ కు అటాచ్ మెంట్ చేశారు. రఘునాథపాలెం స్టేషన్ కు అటాచ్ మెంట్ ఉత్తర్వుల విధులు నిర్వహిస్తున్న మహ్మద్ ఉస్మాన్ షరీఫ్ ను ఖమ్మం వీఆర్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేవారు. జిల్లెలమూడి మోహన్ బాబును ఖమ్మం త్రీ టౌన్ నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మేడిపల్లి నాగరాజును భద్రాచలం టౌన్ నుంచి ఖానాపురం హవేలీ(ఖమ్మం అర్బన్ )కు బదిలీ చేశారు. రడం భానుప్రకాష్ ను ఖానాపురం హవేలీ నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కాగితోజు శివప్రసాద్ ను సీటీసీ నుంచి ఖమ్మం ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. బెల్లం సత్యనారాయణను ఖమ్మం ట్రాఫిక్ నుంచి బదిలీ చేస్తూ ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఉన్న అన్ని ఠాణాల ఎస్ హెచ్ ఓ లు ఒకే సారి ఈ స్థాయిలో బదిలీలు జరగడం, అందులోనూ కీలక సీఐల్లో స్థానచలనం కలిగి పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు భూ తగాదాలు, సెటిల్ మెంట్ లలో లాభ పడడంతో పోస్టింగ్ తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. విధి నిర్వహణలో లెక్క లేకుండా వ్యవహరించడం కూడా కారణమని తెలుస్తోంది. అంతేగాక భారీ వ్యయంతో ఇళ్ల నిర్మాణము కూడా చేపట్టారు. రెండు, మూడు నెలల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు బదిలీలు జరిగాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు