ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో స్వాతంత్య్ర దిన వేడుక‌లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్ భ‌వ‌న్‌తోపాటు వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి కె.శశికిరణాచారి, లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

సెక్రటేరియట్‌లో సంజయ్ జాజు   

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.

 

అసెంబ్లీ ప్రాంగణంలో

రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎగురవేశారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

డీజీపీ కార్యాలయంలో 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షానవాజ్ ఖాసిం, ఐజీ -మల్టీ జోన్-2 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐజీ రమణ కుమార్, జె.అన్యోన్య, ఏఐజి(అడ్మిన్), ఎస్పీ(లీగల్) సతీష్, సి ఎసఓ యోగేశ్వర్ రావుతోపాటు పలువురు పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హైకోర్టులో..    

హైకోర్టులో చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్యరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *