కీలక బాధ్యతగా ఉద్యోగ నియామకాలు

– ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
– గ్రూప్‌ ‌పరీక్షలను సమర్థంగా నిర్వహించాం
– త్వరలోనే ఇంటర్‌నేషనల్‌ ‌స్పోర్టస్ ‌నిర్వహణ
  -ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం
– తెలంగాణ రైజింగ్‌-2047’ ‌దిశగా అడుగులు వేస్తున్నాం
– గోల్కొండ కోట నుంచి ప్రజలనుద్దేశించి సిఎం రేవంత్‌ ‌ప్రసంగం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని, ఇప్పటి వరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన సిఎం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రూప్‌1, ‌గ్రూప్‌-2, ‌గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4, ‌మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలు అందించామని తెలిపారు. యువతకు నైపుణ్యం, ఉద్యోగాలు కల్పించేందుకు యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, అడ్వాన్స్‌డ్‌ ‌టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు, పాలిటెక్నిక్‌ ‌కళాశాలలను అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తున్నామని వివరించారు. గచ్చిబౌలి స్పోర్టస్ అకాడ, యంగ్‌ ఇం‌డియా డిజిటల్‌ ఎం‌ప్లాయ్‌మెంట్‌ అం‌డ్‌ ‌స్కిల్లింగ్‌ ‌యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే తెలంగాణ వేదికగా యంగ్‌ ఇం‌డియా ఇంటర్నేషనల్‌ ‌స్పోర్ట్స్ 2026 ‌నిర్వహించబోతున్నామని చెప్పారు.  వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, నిమ్స్‌లో 2,000 పడకల నూతన హాస్పిట‌ల్‌నిర్మాణంతోపాటు వరంగల్‌, ‌సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. కొత్తగా 8 మెడికల్‌ ‌కళాశాలలు, 16 నర్సింగ్‌ ‌కళాశాలలు, 28 పారామెడికల్‌ ‌కళాశాలలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ‌సెంటర్‌ ‌నిర్వహణ ఇందుకు నిదర్శనమని, ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5.18 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సరికొత్త సాంకేతికత, వనరులను అందిస్తున్నామని సీఎం చెప్పారు. సైబర్‌ ‌నేరాలు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు డ్రగ్స్ ‌కంట్రోల్‌, ‌సైబర్‌, ఆహార కల్తీ నియంత్రణలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు తగ్గించేందుకు హైవే ట్రాఫిక్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సెంటర్లు, మహిళల భద్రతకు షీ టీమ్స్, ‌పిల్లల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, పీఆర్‌సీ, పెన్షన్లు, ఎంప్లాయీస్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌వంటివి అమలు చేస్తున్నామని తెలిపారు. 36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్‌ అమలు చేశామని, ఈ నెల 17 నుండి అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ’ప్రజావాణి’ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు, మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, చెరువుల పరిరక్షణకు ’హైడ్రా’ ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. పారిశ్రామికంగా టి-ఐడియా ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ గ్లోబల్‌ ఏఐ ‌సమ్మిట్‌ ‌ద్వారా రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించామని, 2025-26లో ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025 తీసుకొచ్చామని, సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ ‌డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ’తెలంగాణ రైజింగ్‌-2047’ ‌దిశగా అడుగులు వేస్తున్నామని, అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు.

కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు
-31 నెలల కృషి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి

నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్‌ ‌ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్యం.. ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని తెలిపారు.సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని.. తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి.. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్నారు. రైతు భరోసా కింద రూ.36వేల కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అలాగే, రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌ ‌కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్‌ ‌పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని తెలియజేశారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగిందని.. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సూచీలో 21 నుంచి 14వ స్థానానికి తెలంగాణ చేరిందని రేవంత్‌ ‌తెలిపారు. నియోజకర్గానికొక ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్‌ ‌నిర్మాణాన్ని చేపట్టామన్నారు. స్కూళ్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, 100కు పైగా తెలంగాణ పబ్లిక్‌ ‌స్కూళ్లు నిర్మించే యోచనలో ఉన్నామని చెప్పారు. అక్రమాలు జరగకుండా ప్రక్షాళన చేశామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్‌ ‌పోటీలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ ‌భవనం నిర్మాణంలో ఉంది. 8 కొత్త మెడికల్‌ ‌కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నాం. విద్యా సూచీలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ 14కు చేరుకుంది. నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్‌ ‌నిర్మాణం చేపట్టాం. వందకు పైగా తెలంగాణ పబ్లిక్‌ ‌స్కూల్స్ ‌నిర్మించే లక్ష్యంతో ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అక్రమాలు జరగకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్‌ ‌పోటీలు నిర్వహించాం. త్వరలో జరిగే ఖేల్‌ ఇం‌డియా పోటీలకు హైదరాబాద్‌ అతిథ్యం ఇస్తుంది. టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా రూ.1.95లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మరో 78వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌ ‌జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో ఇప్పటికే 355కు పైగా జీసీసీలు పనిచేస్తున్నాయి. అమెజాన్‌ ‌సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడి పెడుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాం. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశాం. 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశాం. రెండో విడత కొత్త రేషన్‌ ‌కార్డుల పంపిణీ ఇవాళే ప్రారంభించుకుంటున్నాం. వృద్ధ తల్లిదండ్రుల కోసం చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం వివరించారు.

గోల్కొండ కోటలో త్రివర్ణపతాకం రెపరెప                     
-తొలిసారి పూర్తిస్థాయి వందేమాతర గీతాలాపన  

గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందానాన్ని స్వీకరించారు. తొలిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కోట ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని ఆకాంక్షించారు. స్వాతంత్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశభక్తి, పరస్పర గౌరవం పెంపొందించాలన్నారు. అసమానతలు లేని శాంతియుత, సౌభ్రాతృత్వ భారతదేశాన్ని నిర్మించాలని తెలిపారు. సమరయోధుల త్యాగాలకు అదే నిజమైన నివాళి అని సీఎం వ్యాఖ్యానించారు. నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్య నిష్టతో ముందుకు సాగాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *