హుస్నాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 6 ,7, 11, 12, 13, 17, 19 ,20వ వార్డుల్లో ప్రతి వార్డుకి 50 లక్షల చొప్పున సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వర్ణకార కమ్యూనిటీ మినీ స్పోర్ట్స్ హల్ , అయ్యప్ప నగర్ లో యాదవ కమ్యూనిటీ రీడింగ్ రూం, మడేలయ్య వద్ద రజక కుట్టు యంత్ర శిక్షణ కేంద్రాలను శంకుస్థాపన చేశారు. బురుజు వద్ద 3 కోట్లతో నిర్మించిన నూతన రైతు బజార్ ను ప్రారంభించారు. రూ.కోటితో వ్యవసాయ మార్కెట్ లో నిర్మించిన కవర్ షెడ్ గోదాంను ప్రారంభించారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి రూ.18 కోట్లు టెండర్ అయి పనులు ప్రారంభమయ్యేలా శంకుస్థాపన చేసుకున్నమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్ లో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చేలా ఎల్లమ్మ చేరవు అభివృద్ది చేస్తామన్నారు. పక్కనే గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ లో చుట్టూ కొండలు పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హుస్నాబాద్ పట్టణంలో మరో రెండు కోట్లతో అంబేద్కర్ , గాంధీ ,అనబేరి ప్రభాకర్ ,కొండా లక్షణ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి జంక్షన్ లకు 50 లక్షల చొప్పున కేటాయించుకొని సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు.ప్రతి వార్డు కి 50 లక్షలతో అభివృద్ది, ప్రతి కుల సంఘాలకు 45 లక్షలతో కమ్యూనిటీ హాల్ లు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ ,పోచమ్మ , మైసమ్మ లకు చేయాలని, ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఉన్న మైసమ్మ ఆలయాన్ని అభివృద్ది చేస్తన్నారు. చెరువు వద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేఇస్తామన్నారు .ఎల్లమ్మ చెరువు నుండి పందిల్ల వరకు 3 కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తమని వెల్లడించారు.
కార్యక్రమాలు చేపడతాం.మరో 17 కోట్లతో అరెపల్లి దగ్గర బతుకమ్మ ఘాట్, పల్లె చెరువు , కొత్త చెరువు సుందరీకరణ , పట్టణంలో మరింత అభివృద్ధి చేస్తమని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న రైతుల సంక్షేమానికి రైతు భరోసా కింద గతంలో ఉన్న 10 వేలను ఇప్పుడు 12 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎన్ని ఎకరాలు ఉన్న 26 జనవరి గణతంత్ర దినోత్సవం నుండి రైతు భరోసా రైతులకు డబ్బులు పడుతాయన్నారు. భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి 12 వేల చొప్పున వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఇస్తున్నామన్నారు.
గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవనీ ,26 జనవరి 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయనీ నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం అవుతుందని ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, సర్వే జరుగుతుందని ఇళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. గురుకుల హాస్టల్ లకు 40 శాతం డైట్ చార్జీలు పెంచామన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు అందిస్తున్నామన్నారు. సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చామని వడ్ల కొనుగోలు చేసిన 24 గంటల్లో పేమెంట్ చేశామన్నారు.
కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య,మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి , వైస్ చైర్మన్ బంక చందు,ఆర్డీవో , ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.





