– కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ
న్యూదిల్లీ, సెప్టెంబర్ 23 : ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ జనేష్ కుమార్ వాటిని అనుమతిస్తే అది దేశ ద్రోహం, రాజ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. వయనాడ్ ఎంపీ అయిన ఆమె ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న వారిని కచ్చితంగా నిలదీయాలన్నారు. ఇక్కడి నిలంబూర్ లో విలేకరులతో బుధవారం మాట్లాడిన ప్రియాంకా గాంధీ భారత ఎన్నికల సంఘం వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పక్షపాతం, అన్యాయం గురించి తన సోదరుడు, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరం గళమెత్తుతున్నారని తెలిపారు. ఆయన అనేక సమస్యలను పదేపదే ప్రస్తావించారని, ఇప్పుడు స్వయంగా ఎన్నికల కమిషనర్లు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు కొన్ని సమస్యలను వివరించినట్లు వార్తా మాధ్యమాల్లో కూడా వెల్లడవుతోందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




