అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ !

– దంచి కొట్టిన వాన
– ఉరుములు, మెరుపులతో పాటు పిడుగుల హోరు
– ఉత్సాహంగా గణపతి నిమజ్జనం

చిట్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో దడ పుట్టించింది. ఏకధాటిక పిడుగుల వర్షానికి ప్రజలా బెంబేలెత్తారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రంతా కురిసింది. చిరుజల్ల లతో మొదలైన వాన భారీ వర్షంగా మారింది. పంట చేలల్లో పనులకు వెళ్లిన రైతులు, కూలీలు వ‌ర్షంలోనే ఇళ్లకు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉందని అధికారులు చెబుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఏకథాటిగా వర్షం కురిసే పరిస్థితులు ఉంటాయని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులకు రెండు రోజుల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుండడ రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నది. రాగల రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయనడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ సీజన్లో భారీ వర్షం కురవకపోవడం కారణంగా బుధవారం కురిసిన వర్షానికి రైతుల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా పంటలపై ఆశలు రేకెత్తించాయి. ఎల్‌నినొ ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసారు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. కేవలం బోరు బావుల పైన ఆధారపడి ఈసారి పంటలు సాగు చేస్తున్నారు. దీంతో వాతావరణ శాఖ తీపి కబురుతో కొంత ఉత్సాహంతో ఉన్నారు.

నిమజ్జన ఏర్పాట్లకు భక్తుల ఇబ్బందులు 

గణపతి నిమజ్జనోత్స‌వానికి తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించిన. భక్తులకు వర్షం కారణంగా నిమజోత్స వం నిరాశను మిగిల్చింది. బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో నిమజ్జన ఏర్పాట్లకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలను సిద్ధం చేసుకుని ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డు, ప్రసాదాలు, పూజా సామగ్రి, వస్త్రాల వేలం పాటలు నిర్వహిస్తున్న సమయంలో భారీ వర్గం ఇబ్బందులకు గురిచేసింది. వర్షంలోనే గణపతిని ఊరేగించి సమీప చెరువులు, కుంటలలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పూజల కారణంగానే వరుణుడు కరుణించాడని పలువురు భక్తులు అభిప్రాయప డ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *