– మోదీ దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలపై చర్చకు రాహుల్ సవాల్
న్యూదిల్లీ, నవంబర్ 9 : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపులో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తీవ్రంగా స్పందించారు. సాయుధ మావోయిస్టులను అంతం చేశామని, అయితే ‘మేధో నక్సలైట్లు’ (దామాగీ నక్సల్స్) అనే వర్గం అనేక రాజకీయ పార్టీల్లో, సంస్థల్లో చొరబడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. అలాంటి శక్తులను గుర్తించి ఓడించాలి, అప్పుడే దేశాన్ని కాపాడుకోగలం’ అని మోదీ మాట్లాడారు. ఏటా పండుగ సమయాల్లో దేశ సరిహద్దుల్లో లేదా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బందితో గడపడం ప్రధానికి అలవాటుగా వస్తోంది. దేశ వ్యతిరేకులు ఎవరు, విదేశీ శక్తుల చేతుల్లో ఉన్నవారు ఎవరు అనే అంశంపై తనతో బహిరంగ చర్చకు రావాలని ప్రధానికి రాహుల్ మరోసారి సవాలు విసిరారు. ‘ప్రియమైన సీఆర్‌పీఎఫ్ జవాన్లారా.. మీ ముఖాలే అన్నీ చెబుతున్నాయి.. ప్రధాని చెప్పిన అబద్ధాలను మీరు నమ్మలేదు అని ‘ఎక్స’లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి పోస్టుపెట్టారు. నా సవాలు ఇంకా అలాగే ఉంది. దేశ వ్యతిరేకులు ఎవరు, విదేశీ శక్తుల చేతుల్లో ఉన్నవారు ఎవరు అనే అంశంపై ఆయన నాతో చర్చకు రావాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే. నా హామీ ఏమిటంటే ఆ చర్చ తర్వాత ఒక్క జవాను ముందు నిలబడే ధైర్యం కూడా ప్రధానికి ఉండదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ తీవ్ర ఆందోళనలో, కలత చెందిన స్థితిలో, నిరాశాజనకమైన పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆయన పదవీకాలం ముగిసి సంచులు సర్దుకుని వెళ్ళిపోయే సమయం దగ్గరపడిందని విమర్శించింది. ఆగస్టులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ.. దేశం సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించడంలో విజయం సాధించిందని, కానీ దాని భావజాల మద్దతుదారులు హింసను ప్రోత్సహించడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని చెబుతూ దిమాగీ నక్సల్స్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య అసమ్మతిపై ఉద్దేశపూర్వకంగా ముద్ర వేసి దాని చట్టబద్ధతను దెబ్బతీయడానికే మోదీ ‘దిమాగీ నక్సల’ వంటి పదాలను వాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. రాహుల్ సవాలును బీజేపీ నాయకులు ఎగతాళి చేశారు. పార్లమెంటులో ఇప్పటికే ఒక వేదిక ఉందని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కొంత గంభీరత, బాధ్యత ప్రదర్శించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చురకలంటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




