అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అత్యంత ప్రాధాన్యం
పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం
ఐరాస వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: హైదరాబాద్‌ను కృత్రిమ మేధ (ఏఐ), పరిశో ధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంత ర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభు త్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా వన్ఎంవన్ బి సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. తెలంగాణ లో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు ఈ సంద ర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ సహా నూతన సాంకేతిక రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధా నాలు, బలమైన పారిశ్రామిక పునాదులు రా ష్ట్రానికి ప్రధాన బలమని తెలిపారు.
సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలను వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి వంటి రంగాల్లో వినియోగించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయన్నా రు. సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమా జా నికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందన్నా రు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలు సమన్వ యంతో పనిచేసినప్పుడే బలమైన ఆవిష్కరణల వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఇన్నోవేషన్ ఆధారిత ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తోందన్నారు. యువత కు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంతో పాటు, వారి ఆలోచనలను ప్రపంచస్థాయి ఆవిష్కరణలుగా మలి చేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి… రైజింగ్ తెలంగాణ లక్ష్యసాధనలో భాగస్వా మ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించా రు. నూతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల కు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.





