సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల దుర్మరణం

సూర్యాపేట, నవంబర్ 20: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు బీబీగూడెం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Horrific road accident)జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను ఎదురుగా వచ్చిన టిప్పర్‌ లారీ బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వేంల మండలంలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న కోట్ల రజిత, అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పిల్లల జగ్గుతండాకు చెందిన గుగులోతు రుక్మ (రక్మ) ద్విచక్ర వాహనంపై పాఠశాల నుంచి సూర్యాపేటకు బయలుదేరారు. బీబీగూడెం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ మిక్స్ కంపెనీకి చెందిన టిప్పర్‌ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో, గురుకుల పాఠశాల సిబ్బందిలో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *