– రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి
– పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అండగా నిలిచేందుకు ‘పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరూ వెనుకబడకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 40 వేల విలువైన ఆన్‌లైన్ కోచింగ్ యాక్సెస్‌ను పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తామని నిరుద్యోగ యువతకు మంత్రి హామీ ఇచ్చారు. యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత కొలువులు సాధించాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





