– ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ నెలాఖరు నాటికి పీఆర్‌సీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సీఎస్ చెప్పినట్టు సమాచారం. సమావేశం అనంతరం ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము మూడు డీఏలు ఇవ్వాలని అడిగామని, ప్రభుత్వం రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. 3.46 శాతంతో ఒక డీఏను ప్రభుత్వం ప్రకటించగా రెండో డీఏను 2.74 శాతంతో ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందన్నారు. మూడో డీఏను మÖడునాలుగు నెలల్లో ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ‘పీఆర్‌సీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు అధ్యయనానికి ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో కమిటీ వేస్తామన్నారు.. కమిటీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇవ్వనుంది అని ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు. పీఆర్సీ కమిషన్ గడువును పొడిగించకుండా నివేదిక అందేలా చూడాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. డీఏ, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





