– రూ.1.20 కోట్ల విలువైనదిగా గుర్తింపు
హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆరఐ) అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సోమవారం ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా దీని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. పక్కా సమాచారం మేరకు డీఆరఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారిగా గుర్తించారు. అతని లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. తొలుత కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో ఈ బంగారాన్ని గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని విచారణ కోసం డీఆరఐ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


