-స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతోపాటు నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నాలుగేళ్లలో ప్రజల విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగడం అభినందనీయం. సంస్థ మరింత అభివృద్ధి చెంది, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను.”ప్రత్యేక అతిథి శ్రీ సాయికుమార్ మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ప్రజలకు నమ్మకమైన సేవలు అందిస్తూ సంస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.” స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. భరత్ రెడ్డి డి. మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక, విశ్వసనీయమైన డయాగ్నస్టిక్ సేవలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు, సిబ్బంది, అతిథులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





