డిసెంబర్‌ 7నుంచి ‘గ్లోబల్‌ ‌సమ్మిట్‌’

– ఇన్వెస్ట్ ‌తెలంగాణ థీమ్‌తో సమ్మిట్‌కు ప్లాన్‌
-‌ క్యూర్‌ ‌పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూకేటాయింపులు
– క్యూర్‌ ‌పరిధిలో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు పథకం
–  స్కిల్‌ ‌యూనివర్సిటీ పరిధిలోకి ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు
– ఏడు రకాల సన్నాల సాగుకు ప్రోత్సాహం.. ప్రచారం
– మక్తల్‌-‌నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలకు రూ.2,100 కోట్ల అంచనా
– కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ‌ఆమోదం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 :‌ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌ 2.0’ ‌నిర్వహణకు కేబినెట్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. రాబోయే డిసెంబర్‌ 7, 8, 9 ‌తేదీల్లో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను గతేడాది కంటే మరింత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ప్రత్యేకంగా ఇన్వెస్ట్ ‌తెలంగాణ థీమ్‌తో ఈ సమ్మిట్‌ను ప్లాన్‌ ‌చేస్తున్నారు. అంతేకాక ఇప్పటివరకు స్టార్టప్‌లు సాధించిన విజయాలు, సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్‌ ‌ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కేబినెట్‌ ‌భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలసి డియాకు వివరించారు. ఎంపి రఘురామిరెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, వివేక్‌ ‌వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్‌ ‌కమిటీతోపాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధానంగా రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్‌, ‌ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సు జరుగుతుందన్నారు. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలు, వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్‌, ‌స్టాళ్లను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌, ‌గ్రేటర్‌ ‌పరిధిలోని సిటిజన్స్ అర్బన్‌ ‌రీస్టక్చ్రరింగ్‌ అం‌డ్‌ ఎకానమీ ప్రాజెక్ట్ ‌పరిధిలో నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు స్థలాల కేటాయింపు పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. మూడు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యూర్‌ ‌పరిధిలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో స్మార్ట్ ‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, వాటి సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని క్యాబినెట్‌ ‌నిర్ణయించింది.  రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్‌ ‌చెల్లించాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ ‌కాలేజీలను యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ ‌కళాశాలలు సాంకేతిక విద్యా శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌యాక్ట్ ‌నుంచి తొలగించి యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌ముథోల్‌, ‌బోథ్‌, ‌సిర్పూర్‌, ‌గజ్వేల్‌, ‌దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూళ్ల నిర్మాణానికి క్యాబినెట్‌ ‌గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో తొలివిడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్స్ ‌స్కూల్‌ ‌కాంప్లెక్స్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మ‌రో ఏడు స్కూల్‌ ‌కాంప్లెక్స్‌లకు అనుమతులు

ఈ స‌మావేశంలో కొత్తగా ఆమోదించిన ఏడు స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 స్కూల్‌ ‌కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీలైనంత త్వరగా స్థల సేకరణ చేసి నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌ (‌క్యూర్‌) ‌పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్‌ ‌సిటీగా మార్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్‌ ‌పరిధిలో నగరంలో ప్రస్తుతం 18,766 పెట్రోల్‌, ‌డీజిల్‌ ఆటోలున్నాయి. వీటిని విద్యుత్తు వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50లక్షల సబ్సిడీ అందించాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. హైదరాబాద్‌ ‌సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ ‌పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్‌ 31 ‌వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మక్తల్‌-‌నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2 ‌పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నుంచి అందనుంది. గూడెందొడ్డి పంప్డ్ ‌స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచటంతోపాటు సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్‌స్టలెంట్‌ ‌నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *