– ఆ విషయమే చెప్పాను తప్ప ఎవ్వరినీ నొప్పించలేదు
– మరోమారు స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్
యాదాద్రి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : కాంగ్రెస్‌లో బయటనుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం చేసిన ఈ వ్యాఖ్యలపై శుక్రవారం మరోసారి మీడియాకు ఆయన స్పష్టత ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్‌గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తానెక్కడా పార్టీ నాయకులను విమర్శించలేదని, విమర్శించనని తేల్చిచెప్పారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణచి వేస్తున్నారనే విషయాన్ని తాను గుర్తు చేశానన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ఉద్యమకారులకు గుర్తింపు ఉండాలని సూచించారు. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర విÖడియా చెప్ప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వం నడపవద్దని కోరారు. ప్రజాపాలన అంటే పేదల కోసం పనిచేయాలని సూచించారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల£”, సీమాంధ్ర నాయకుల కోసం కాదని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు.
రాజగోపాల్ వ్యాఖ్యలు సరికాదు : పీసీసీ చీఫ్ మహేష్ పీసీసీ 
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
’రాజగోపాల్‌రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకుంటాం. .పార్టీకి సంబంధించి నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడకూడద’ని హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి ప్రజా నాయకుడు.. నాకు మంచి మిత్రుడు. గీత దాటి మాట్లాడకూడదు.. ఆయన అలా మాట్లాడటం సరికాదు. సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయి. ఏం మాట్లాడినా అధిష్ఠానం దృష్టికి వెళ్తుంది. బిల్లుల విషయంలో ఒక క్రమపద్ధతిలో ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా మేం చేయట్లేదని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనివాళ్లు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్నారన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




