మాట నిల‌బెట్టుకున్న గాంధీ కుటుంబం

– నాటి పాద యాత్ర‌లో మీ క‌ష్టాలు తెలుసుకున్న రాహుల్‌
– మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అప్పుడే హామీ
– ఆయ‌న చేతుల మీదుగా నేడు గిగ్ వ‌ర్క‌ర్స్ చ‌ట్టం 
– గిగ్ వ‌ర్క‌ర్ల స‌భ‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 2013లో 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేదల కష్టాలను కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌ గాంధీ తెలుసుకున్నారని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. జయభేరి గ్రౌండ్ లో శ‌నివారం జ‌రిగిన‌ గిగ్ వర్కర్స్ సభకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజ‌రు కాగా స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి ప్ర‌సంగిస్తూ ఆనాడు పాద‌యాత్ర‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీని గిగ్ వర్కర్స్ కలిసి తమ సమస్యలను వివరించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. గిగ్ వర్కర్స్ రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని రాహుల్ గాంధీ ఆనాడు మాట ఇచ్చారని చెప్పారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందంటూ ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ చట్టం శ‌నివారం నుంచి అమలవుతున్న‌ద‌ని చెప్పారు. గిగ్ వర్కర్స్‌కు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాంమ‌ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామ‌ని, గిగ్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు..రాహుల్ గాంధీ మాట ఇస్తే సువర్ణాక్షరాలతో లిఖించినట్లే అని సీఎం చెప్పారు. రాహుల్ గాంధీ మాట త‌మ‌కు ఆదేశమ‌న్నారు. ఈ చట్టం అన్ని విధాలుగా మీకు రక్షణ కల్పిస్తుంద‌ని చెప్పారు. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌ని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్స్ తరపున రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు చెబుతున్నామ‌న్నారు.

రాహుల్‌కు ఘ‌న స్వాగ‌తం, బైక్ ర్యాలీ 

 

తొలుత హైద‌రాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్‌, త‌దిత‌రులు ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. శిల్పారామం నుంచి గిగ్ వ‌ర్క‌ర్స్ స‌భ జ‌రిగే జ‌య‌భేరి గ్రౌండ్స్ వ‌ర‌కు గిగ్ వ‌ర్క‌ర్ల బైక్ ర్యాలీ జ‌ర‌గ‌గా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌, మంత్రులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. జ‌య‌భేరి గ్రౌండ్‌లో స‌భ‌కు ముందు ప్ర‌థ‌మ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చిత్ర ప‌టం వ‌ద్ద అంద‌రూ పుష్పాంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం స‌భ ప్రారంభ‌మ‌వ‌గా గిగ్ వ‌ర్క‌ర్ల నుద్దేశించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి త‌దిత‌రులు ప్ర‌సంగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *