‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు
ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ..
ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా. బడికి పోదాం రండి కూలోల్ల పొరలం..బడికెళ్లే హక్కన్నది కలిగినోళ్ళ దే కాదు ..బడిలో చేరి చూపిద్దాం బరాబరి సాధిద్దాం అనే ‘భూమితల్లి బిడ్డలం’ నాటకాలు వేసి రంగారెడ్డి జిల్లాలో 90 లలో రెండు దశాబ్దాల పాటు వేలాది మంది పిల్లలను పని మాన్పించి  బడికి కదిలించిన విద్యా ఉద్యమం అది. పని మానినం ఇక బడి మాదే అని నినదించి వస్తున్నాం పిల్లలం రేపటి లోకం మాదే మాదే.. అని పాటలు పాడుతూ బ్రిడ్జి కోర్సులు పూర్తి చేసి డైరెక్టుగా తోటి పిల్లలతో బడిలో చేరి ఎన్ని ఇబ్బందులు వొచ్చినా తట్టుకుని చదువులు పూర్తి చేసి వివిధ వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలను చేరిన కొందరు పూర్వ విద్యార్థులు మళ్లీ ఒక్కటయ్యారు.

సామాజిక మాధ్యమాల ద్వారా దాదాపు వెయ్యిమంది పూర్వ విద్యార్థులను కాంటాక్ట్ ‌చేసి వికారాబాద్‌ ‌లో 29 డిసెంబర్‌ ‌లో ఒక ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంత సిన్హాను వారికి చదువులు నేర్పిన 80 మంది బ్రిడ్జ్ ‌కోర్సు టీచర్లను పిలుచుకుని సన్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది వారి అనుభవాలను పంచుకుంటూ..  కోల్పోయిన నా బాల్యాన్ని మీరు రక్షించారు. చదువుకు తోడ్పడ్డారు. నేను మిలటరీలో చేరి మన దేశ సరిహద్దులో రక్షణ విధుల్లో ఉన్నాను.. క్యాంపులో నే చదివిన ఇంకో మిత్రుడు ప్రస్తుతం లెబనాన్‌ ‌దేశంలో శాంతి నిర్వహించే సైనిక బాలగాలలో ఉన్నాడు. మరో వ్యక్తి  జీతం చేస్తున్న నన్ను విముక్తి చేసి చదువు నేర్పితే ఇప్పుడు ప్రభుత్వ టీచరునై వేలాది మంది కి విద్యా బుద్ధులు నేర్పుతున్నానని చెప్పారు.  ఇటుక బట్టీలలో పనిచేస్తున్న తనను చదువు దారి పట్టిస్తే ఇప్పుడు సివిల్‌ ఇం‌జనీర్‌ ‌నై నిర్మాణ సంస్థలోపనిచేస్తున్నట్లు మరో పూర్వ విద్యార్థి వెల్లడించారు.

నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వక ముందే సంకన మేడితో సాలీరు వాలు దున్ని నానయ్యో అన్నట్లు బాల్యం లోనే పని చేసి చేసి నా మొద్దు బారిన చేతులు పెన్ను పెన్సిల్‌  ‌పట్టరాకపోతే మట్టి ముద్దను పిసికించి కలం పట్టేటట్లు చేసి చదువు నేర్పినందుకు ఇప్పుడు నేను తుపాకీ పట్టి పోలీసు శాఖ లో పౌరుల శాంతి భద్రతల బాధ్యత వహిస్తున్నాననటి ఒక పూర్వవిద్యార్థి తెలిపారు.  మరో విద్యార్థి  కూలి పని చేస్తున్న అక్షరాలు రాని నాకు చదువు మెళుకువలు నేర్పినందుకు టీచరయ్యానని ఎంతో మంది నా విద్యార్థులను విదేశాలకు వెళ్లే విధంగా తీర్చిదిద్దానని తెలిపారు.
కులం పేరుతో గుడికి రానీయని మమ్ములను చదువుతో ముందుకు నడిపితే ఆ ఊరికి సర్పంచి నై ఆ గుడి కే పెద్ద నై అందరికీ గుడి తలుపులు తెరిచానని ఒక విద్యార్థి చెప్పాగా,   ఆటలాడే వయసు లోనా నేను వెట్టి చేస్తుంటే విడిపించి చదివే మార్గం చూపితే జాతీయ స్థాయి వాలీబాల్‌ ఆటగాడినై ణై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ జి.ఎస్‌.‌టి విభాగం లో ఇన్కమ్‌ ‌టాక్స్ఆఫీసరయ్యానని మరొకరు తెలిపారు. వొచ్చి రాని పాటలు పాడుకుంటా మేకలు గాసే నాకు విద్య తోనే విముక్తి అని చదువు మార్గం పట్టిస్తే బాలకార్మిక విముక్తికి పాటల గాయని గా అలాగే మొదటి వీడియో జర్నలిస్టు గా పేరు ప్రఖ్యాతులు అందుకున్నానని ఒకవిద్యార్థి చెప్పారు.  ఇక మరికొందరు పూర్వవిద్యార్థుల విజయగాధలు వారి మాటల్లోనే చదువులేని తల్లిదండ్రులు భూముల విషయమై రెవెన్యూ అధికారుల కాళ్ల వేళ్ల పడ్డ దుఃఖం ఒక వైపు మరియు నేను పత్తి తోటలో పనిలో ఉండి బడికి పోని బాధ లో ఉంటే  మేమున్నామని ధైర్య మిస్తే ఏకంగా రెవెన్యూ శాఖలో ఉద్యోగం కొట్టి ఇతరులు దుఃఖం లో ఉండ కుండా చూసుకునే స్థాయికి చేరిన..

దారి తప్పి వీధి బాలికనై పట్టణం బంగలాల్లో వెట్టి చాకిరీ చేస్తున్న నన్ను చేరదీసి నా మొండి తనాన్ని భరించి ఓపికతో నచ్చ చెప్పి నా మాతృ భాష కానీ తెలుగు ను నేర్పి సాహసాన్ని నూరి పోసిననదుకు ఇప్పుడు నేను ఒక బహుళ జాతి కంపనీలో మానవ వనరుల అధి కారిగా పనిచేస్తున్నా.. ఇలా ఒక్కరిది ఒక చరిత్ర ఒక్కరిది ఒక గెలుపు ఒక్కరిది నియ్యతైన పోరు సలిపి గెలిచి నిలిచిన ఏం.వి.ఎఫ్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆది అంతం ఉద్వేగం ..ఉత్సాహం ..అలసట లేని ఇంపైన కథనాలు ఆత్మీయ సమ్మేళనంలో మొత్తంగా పల్లెటూరి పిల్లలంతా పాలు మరవని వయసులోనే కాళ్లకు చెప్పులు లేక తాటి జగ్గల కాళ్ళ జోడ్లతో, మా కన్నీల్లు కలిగినోళ్లకు పన్నీరై తుంటే ఒంటిగా శోకంలో ఉన్న మా అందరికీ మా జంటగా ఉంటామని మా తోడుగా ఉంటామని బాస చేసినందుకు మేము ఈ రోజు వేలాది మందిమి మా వృత్తులలో రానించి అవమానాలు పడ్డ చోటనే సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరుగుతున్నామని గర్వంగా ఒక్కరొక్కరు తమ గాధలను పంచుకుంటుంటే అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చూసి సంతోష ఉద్వేగాన్ని పంచు కుని గర్వపడ్డ రోజు ఈ రోజని చప్పట్లతో సెల్ఫీలతో కేరింతలతో ఈలలతో హాల్‌ ‌దద్దరిల్లింది. అవును బర్ల కాసిన గొర్ల కాసిన, జీతాలు ఉన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని చేలల్లో చెలకల్లో పని చేసిన పిల్లలు పని మాని బడికెళ్ళి ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ‘ఎదిగిన పిల్లలందరికీ అభినందనలు. ఈ సంధర్భంగా రాజ్యాంగ స్పూర్తితో చేసిన బాసలను ముందుకు తీసుకు పోయే నేటి సమాజ నిర్దేశకులకు సల్యూట్‌ .‌మీకు వెన్నంటి ఉన్న మీ టీచర్లను మమ్మల్ని సన్మానించినందుకు పేరు పేరునా అభినందనలు.

అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామని కుల మత బేధాలు లేకుండా దయతో నిండిన, క్షమించే గుణంతో సామరస్య సమాజానీ కై కలిసి పనిచేస్తామని మీరు పూనిన ప్రతిన ‘‘మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ ‌ద్వారా పని మాని చదు వుకు కదిలిన మేము ఒక్కొక్కరం సమాజంలో బాలలందరికీ న్యాయం అందె విధంగా బాలల హక్కుల పరిరక్షణకు  మరియు బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ  నుండి మమ్మల్ని విముక్తి చేసి మా స్వేచ్చ కు కారణమైన మా ఎన్‌.‌వి.ఎఫ్‌ ‌కు మేము ఇచ్చే బహుమతి ఇదే’’..  అని సమావేశం ఉద్వేగభరితంగా ముగించి మళ్ళీ కలుద్దాం అని పిలుపునిచ్చినందుకు ఎం.వి.ఎఫ్‌ ‌తరఫున అందరికీ అభినందనలు.
– ఆర్‌.‌వెంకట రెడ్డి
జాతీయ కన్వీనర్‌, ఎం.‌వి. ఫౌండేషన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page