కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను నిలదీయడం , ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా పీవీనే. .

విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355
పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణాది నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు…దివాలా అంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి… ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిన అపర చాణక్యుడు.17 భాషలలో అనర్గళంగా మాట్లాడిన బహుభాషా కోవిదుడు.స్వాతంత్య్రోద్యమకారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి-సీతారామారావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. దాదాపు మూడేళ్ల వయసులో కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. నిజానికి పీవీ నర్సింహరావుకు కన్న తల్లిదండ్రులు, పెంచిన వారు వేర్వేరు అనే సంగతి చాలా మందికి తెలియదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లోనే అంటే 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు.దీంతో ఓయూ నుంచి ఆయనను బహిష్కరించడంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లోనే అతని ఇంట్లో ఉంటూ 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బీ చదివారు. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పీవీ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్లతో కలసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు.
పీవీ రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది.1952 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన.. ప్రముఖ కమ్యూనిస్టునేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత 1957 నుంచి 1972 వరకు నాలుగు సార్లు మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖ పదవులు నిర్వహించారు.1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నేతను సీఎంగా ఎంపిక చెయ్యడం అనివార్యమైంది. దీంతో వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలో ఏ వర్గానికీ చెందని ఆయన రాజకీయ నేపథ్యం 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా నడిచిన నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ప్రత్యేక స్థానం.హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేకున్నా పీవీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు.పాములపర్తి వేంకట నర్సింహారావు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉన్నప్పటికీ.. సమర్థతవల్లే ఆనాడు పీవి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా పీవీ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు దిల్లీ, హైదరాబాద్ మధ్య తిరగడంతోనే సరిపోయేది. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలా మంది రాజీనామా చేశారు. తన హయాంలో భూసంస్కరణలు కఠినంగా అమలు చేయడంతో పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈవిషయమై అధిష్టానంతో చర్చించేందుకు దిల్లీ, హైదరాబాద్ ల మధ్య తిరగడంతోటే సరిపోయేది. దీంతో 1973 జనవరి 8న కొత్త వారితో పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. కానీ ఆ సయమంలో జరిగిన రాజకీయ కుట్రలకు లొంగిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ విధంగా ముఖ్యమంత్రిగా పీవీ పదవీకాలం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది ఇక రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు.పీవీ సేవలను జాతీయస్థాయిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఆయన్ను 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
పీవీ 1977లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు హన్మకొండ నుంచి మరో రెండు పర్యాయాలు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి,1991లో ఏపీలోని నంద్యాల నుంచి, 1998లో ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.1980-1989 మధ్య కేంద్రంలో హోం, విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను ఆయన చేపట్టారు. అప్పుడే రాజీవ్ గాంధీ దారుణహత్య తర్వాత ఏర్పడ్డ సంక్షోభం ఆయన్ను ప్రధాని పదవి వరించింది.1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయని పీవీ.. దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు.ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని, పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనిపించడంతో ఆయన్ను ప్రధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పటికి ఆయన ఎంపీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి చేత కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలో గెలిచిన పీవీ నర్సింహారావు తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా రాజనీతిజ్ఞతతో వ్యవహరించి ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన వెంటనే ‘లైసెన్స్ రాజ్’ కు తెరదించి దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాటలో పరుగెత్తించారు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, ఇందిర, రాజీవ్ తర్వాత….. మొదటి వ్యక్తి పీవీ మాత్రమే. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించడం.. ఆయన అసమాన చాణక్య ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.
పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు జరిగాయి ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ చుట్టుముట్టాయి.తన క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా ఉన్న గత ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి.. సంస్కరణలకు ఊతమిచ్చారు. పీవీ పాలన పగ్గాలు చేపట్టిన సమయం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజసిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వశాఖల్లో ఆయనకున్న అపార అనుభవం ఆయనకు ఆ సంక్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి.అదేవిధంగా కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను నిలదీయడం , ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా పీవీనే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారయిందన్న విషయాన్ని స్వయంగా వాజపేయి కూడా ప్రకటించారంటే పీవీ ఘనత ఏపాటిదో తెలుసుకోవచ్చు. దేశ గతిని మార్చి సంస్కరణల పథంవైపు నడిపించిన మార్గదర్శిని ఎట్టకేలకు భారతదేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వెతుక్కుంటూ రావడం ఆయన అభిమానులను తెలంగాణ గడ్డను ఆనందంలో ముంచెత్తింది.కేసీఆర్ ప్రభుత్వంలో పీవీ స్మృతి వనం, విజ్ఞాన వేదికకోసం రూ.11కోట్లు కేటాయించినా నిధులు కేటాయించలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక గౌరవ శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చొరవతో పీవీ పుట్టినిల్లు వంగర పర్యాటక కేంద్రంగా,పివి విజ్ఞాన కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.
(పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా )





