– భారీగా వచ్చి చేరుతున్న నీరు.. 8 గేట్లు ఎత్తివేత
– 10,849 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో 8 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 10,849 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.34 మీటర్లుగా ఉన్నట్లు అధికా రులు తెలిపారు. వరద ఉధృతి, ప్రాజెక్టు నీటిమట్టాన్ని అధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు డీఈ తిరుప తిరావు సిబ్బందితో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





